అర్జున విషాద యోగం: మూడవ శ్లోకం
పశ్యైతాం పాండుపుత్రాణాం ఆచార్య మహతీం చమూమ్ |వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమతా ||
తాత్పర్యం:
ఆచార్యా ! ధీమంతుడైన మీ శిష్యుడు, ద్రుపద పుత్రుడు (ధృష్టద్యుమ్నుడు) వ్యూహం పన్నిన పాండు పుత్రుల (పాండవుల) మహాసైన్యాన్ని చూడండి
ఆచార్యా ! ధీమంతుడైన మీ శిష్యుడు, ద్రుపద పుత్రుడు (ధృష్టద్యుమ్నుడు) వ్యూహం పన్నిన పాండు పుత్రుల (పాండవుల) మహాసైన్యాన్ని చూడండి
నేపధ్యం:
ద్రుపద రాజు చిన్ననాటి స్నేహితుడు ద్రోణుడు,ఇద్దరూ కలిసి చదివారు. ద్రుపదుడు తన మిత్రుడని ద్రోణుడు నమ్మాడు. విద్యాభ్యాసం అయ్యాకా ద్రోణుడు కటిక పేదరికం అనుభవిస్తే, ద్రుపద మహారాజు విలాసవంతమైన జీవితం అనుభవించాడు.మొహమాట పడుతూనే ద్రోణుడు విధిలేని పరిస్థుతులలో సహాయాన్నర్థించి వెడితే, అవమానపరిచాడు.
దానితో ద్రోణుడు కురు రాజకుమారులకు గురువు గా నియమితమయ్యాకా, గురు దక్షిణ సమయం వచ్చేసరికి ద్రుపదుడిని ఓడించి రమ్మని మొదటి సారి కౌరవులని, వారి ప్రయత్నం విఫలం కాగా, పాండవులని పంపాడు.ద్రుపదుడు బందీగా తన ముందు నిలబెట్టబడి ద్రుపద రాజ్యం ఈవిధం గా తనదయ్యాకా, రాజ్యాన్ని తిరిగి అతనికే ధారపోసి, స్నేహపూరితం గా వీడ్కోలు తీసుకున్నా, అవమాన భారం తట్టుకోలేక ద్రోణుడిని చంపే కొడుకు కోసం తపస్సు చేయగా, యజ్ఞఫలం గా పుట్టిన వారే ధృష్టద్యుమ్నుడు మరియు ద్రౌపది.
ధృష్టద్యుమ్నుడు ద్రోణాచార్యుని దగ్గరే యుద్ధ విద్యలని అభ్యసించాడు. కౌరవుల సైన్యాధ్యక్షుడు భీష్మాచార్యుడు కాగా, పాండవ సేన సారథ్యం ధృష్టద్యుమ్నుడు చేపట్టడం లో కృష్ణుని పాత్ర ఉంది.
చిన్న నాటి స్నేహితులు..పెద్దయ్యాకా?
ద్రోణ, ద్రుపదుల కథ మహా భారత కాలం లో ముఖ్య పాత్ర దారులైన ఒక మహారాజు, మరియు ఒక హస్తినాపుర రాజకుమారుల గురువు గార్ల దవడంతో, కథ దశాబ్దాలు నడిచి మహా యుద్ధం లో ముగిసింది.
మన నిత్య జీవితం లో మనమూ ఏదో ఒక ఎత్తులో కొంత మంది తో ద్రోణ పాత్ర, ఇంకొందరితో ద్రుపద పాత్ర పోషిస్తూనే ఉంటాము. చాలా సార్లు నేను గమనించిన విషయం మనలో చాలామంది. చిన్నప్పుడు ఏ అమ్మమ్మ/నాయనమ్మ గారింటికి వెళ్లినప్పుడు తిరిగిన మిత్రులని సిటీ లో తమ స్నేహ బృందం తో కనపడినప్పుడు వారు ఊర్లో మనల్ని ఆదరించినంత ఆత్మీయత తో ఆదరించలేము. అలాగే ఒక ఇంజనీరు సహోద్యోగి తో మాట్లాడినప్పుడు నాకు అర్థమైంది.అతను చిన్నప్పటి సహాధ్యాయులు కనీసం తన స్థాయి లో ఉంటేనే చిన్నప్పటి స్నేహాన్ని గుర్తుచేసుకోవడానికి ఇష్టపడతాడు.ఆయన క్లాస్మేట్ ఒక అమ్మాయి టైలర్ గా అత్తవారి ఊర్లో జాకెట్లు కుడుతుందిట.ఇంకొకతను పాన్ డబ్బా పెట్టుకున్నాడట. ఊర్లో పలకరిస్తే, చాలా సిగ్గుపడ్డాడట. అది చెప్పుకుని.. తల గుగుర్పాటు తో విదిలించుకోవడం చూశాను. మనమందరమూ కూడా జీవితం లో ఎవరో కనీసం ఒక్కరితోనైనా,..ఏదో స్థాయిలో, ఎవరో ఒకరితో ఈ విధమైన తప్పిదం చేశామా, ఇక ముందు చేస్తామా?అన్నది ఆలోచించుకోవలసిన అవసరం ఉంది. అలాగే ఒకవేళ ఈ విధమైన బలహీనత కి మన స్నేహితులు లోని ఉంటే,.. జాలిపడి క్షమించి, ముందుకెళ్లిపోవాలి తప్ప, మళ్లీ ప్రతీకార ధోరణిని అలవరచుకుంటే ఒక మనశ్శాంతి దక్కినట్టే!!
కృష్ణ కృష్ణ
No comments:
Post a Comment