అర్జున విషాద యోగం: ఏడవ శ్లోకము
నాయకా మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమి తే ||
తాత్పర్యం: (గీతా ప్రెస్,గోరఖ్ పూర్ వారి పుస్తకం నుంచి)
బ్రాహ్మణోత్తమా ! ఇక మన సైన్యంలో ఉన్న నాయకులూ, సుప్రసిద్ధులూ అయిన వాళ్ళ గురించి కూడా చెబుతాను.
బ్రాహ్మణోత్తమా ! ఇక మన సైన్యంలో ఉన్న నాయకులూ, సుప్రసిద్ధులూ అయిన వాళ్ళ గురించి కూడా చెబుతాను.
నేపధ్యం:
4,5,6 శ్లోకాలలో పాండవ సేనలోని యుద్ధవీరుల పట్టీ దుర్యోధనుడు గురువు ద్రోణాచార్యుని కోసం చదివితే తమ వైపు నిలిచిన వీరుల గురించి తరువాతి శ్లోకాల్లో చెప్తాడు.
ద్రోణునికి కౌరవుల వైపునుండి, పాండవుల వైపు నుండి ఎవరెవరు యుద్ధం లో నుంచున్నారో తెలియక దుర్యోధనుడు ఈ విధం గా ప్రవర చదువుతున్నట్టు మనం అర్థం చేసుకోకూడదు. యుద్ధ భూమి లో అదిగో పాండవ సేనాని ని చూడండి, ఆయా మహారథులని చూడండి.. మనవైపు వీరందరినీ ఎదిరించి ఓడించడానికి సంసిద్ధులైన మహారథులని, ఇతర వీరులు వీరందరితో కలిసి శతృవులని ఓడిద్దామని ఉత్సాహ పరిచే మాటలు గా మనం చూడాలి.
కృష్ణ కృష్ణ
No comments:
Post a Comment