Wednesday, April 10, 2013

శ్లో:19. పాండవ సైన్యం బలం ఎక్కువా? కౌరవులదా? భారత యుద్ధం లో ఆంధ్రులు ఎవరి పక్షాన నిలిచారు?

అర్జున విషాద యోగం : శ్లో. 19

స ఘోషో ధార్తరాష్ట్రాణాం హృదయాని వ్యదారయత్ |
నభశ్చ పృథివీం చైవ తుములో వ్యనునాదయన్ ||

తాత్పర్యం:

ఆ శంఖధ్వనులు భూమి ఆకాశాలను దద్దరిల్లజేస్తూ కౌరవ వీరుల హృదయాలను బద్దలు చేశాయి.

నేపధ్యం:

భీష్మాచార్యుడు శంఖం పూరించగానే, కౌరవవీరుల శంఖభేరీ ఢక్కామృదంగ గోముఖాది ధ్వనులతో దిక్కులన్నీ పిక్కటిల్లాయి.  మరి అదే పాండవ వీరుల శంఖ ధ్వనులు, కౌరవుల గుండెలని బ్రద్దలు చేశాయి అనడం లో పాండవుల సైన్యాన్ని చూసి కౌరవులు భయపడ్డారు అని చెప్పడం లో వ్యాసుడు పాండవుల సైన్యమే బలమైనదని చెప్తున్నాడనిపిస్తుంది.

నిజానికి, కౌరవుల పక్షాన పదకొండు అక్షౌహిణుల సైన్యం ఉంది. పాండవుల వైపు కేవలం ఏడు అక్షౌహిణులే ఉన్నారు. భీష్మ,ద్రోణ,కృప,శల్యాది గొప్ప వీరులు అంటే కుటుంబం, గురువులు  కౌరవుల వైపే ఉన్నారు.  అయినా కౌరవులు పాండవుల శక్తి ని చూసి భయపడ్డారంటే,  చాలా కారణాలున్నాయి.


ముందుగా కౌరవుల బలం చూద్దాం..

కౌరవుల పదకొండు అక్షౌహిణులకు, కృపాచార్యుడు, ద్రోణుడు, శల్యుడు, జయధద్రుడు (సింధురాజు), సుదక్షినుడు(కాభోజ రాజు), కృతవర్ముడు, అశ్వత్థామ,కర్ణుడు, భూరుశ్రావుడు, శకుని(సువల రాజు), ఇంకా బాహ్లీకుడు అధిపతులు.

ఇక కౌరవుల వైపు పోరాడిన వారిలో కాంభోజ, శక,ఖస, శల్వ, మత్స్య రాజులు, అలాగే మధ్య దేశ ప్రాంతపు కురు వంశ రాజులు మ్లేచ్ఛ, పుళింద,ద్రవిడ, ఆంద్ర, కంచీ, భోజ, అవంతి, కోసల, రాక్షస, ప్రజ్ఞ్యోతిష, త్రిగర్త రాజులు ఉన్నారు.

ఇక వీరుల విషయానికొస్తే  శారద్వతుడు, వివింగ్సతి, బృహద్వలుడు, సౌమదత్తి, భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, శల్యుడు, కాంభోజ రాజు, జయధద్రుడు, శకుని, పురుమిత్రుడు, దుర్మర్షునుడు, పురుమిత్రుడు, శకుని, భూరిశ్రావుడు,  ఇలాగ చాలా మంది ఉన్నారు.

ఉద్యోగ పర్వం లో భీష్ముడు తమ సైన్యాన్ని వర్ణిస్తూ కౌరవ వీరులని క్రింది విధం గా పేర్కొన్నాడు.

రథులు, అతిరథులు, మహారథులు..
రథులు:

దుర్యోధన, దుశ్శాసనులు, కాంభోజ రాజు సుధక్షిణుడు,మహిష్మతుడు,నీలుడు,విందానువిందులు అవంతీ నగర రాజులు, అన్నదమ్ములు), త్రిగర్త రాకుమారులు ఐదుగురు, దుర్యోధనుని కొడుకు లక్ష్మణుడు, దుశ్శాసనుని కొడుకు, దండధరుడు, కోసల రాజు వ్రిహద్వాలుడు, శకుని, గంధర్వ రాజులు అచలుడు మరియువృషుడు
అతిరథులు: భోజరాజు కృతవర్మ, శల్యుడు, బాహ్లీకుడు
మహారథులు :అశ్వత్థామ,వృషసేనుడు (కర్ణుని కొడుకు) , సత్యవాన్ (కౌరవుల సేనాని), రాక్షస రాజు, ఆలంభూషణుడు
ద్వి రథులు : సింధురాజు జయదద్రుడు
అర్థరథుడు : కర్ణుడు (దీనికి సహజ కవచ కుండలాలు కోల్పోవడం, వివిధ శాపాలు.. కారణాలు గా చెప్తాడు)


పాండవులు వైపు?

ద్రుపదుడు, విరాట రాజు, ద్రుష్ట్యద్యుమ్నుడు, శిఖండి, సాత్యకి, ఇంకా చేకితానుడు, భీముడు పాండవుల ఏడు అక్షౌహిణులకి అధిపతులు గా వ్యవహరించగా

పాండవుల వైపు, పాంచాల, ప్రభద్రక రాజులు, కేకయ దేశపు ఐదుగురు అన్నదమ్ములు, రాక్షస రాజు ఘటోత్కచుడు, సాత్యకి, ద్రుష్ట్యకేతు, ఉత్తమౌజుడు, చేకితానుడువంటి రాజులు నిలబడ్డారు.

వీరి వైపు వీరులు..
అర్థరథుడు :క్షత్రధర్ముడు (ద్రుష్టద్యుమ్నుని కొడుకు)
రథులు : ధర్మరాజు, నకుల సహదేవులు, ఉత్తరకుమారుడు,శిఖండి, క్షత్రదేవుడు, కాశికుడు, సుకుమారుడు, నీలుడు, సూర్యదత్తుడు, శంఖుడు (మదిరస్వుడు), చిత్రయుధుడు, చేకితానుడు, సత్యద్రుతుడు, వ్యాఘ్రదత్తుడు, చంద్రసేనుడు, కస్యుడు, పాండ్య రాజు,
ఎనిమిది (అష్ట)రథులు : భీముడు, సత్యజిత్తు (ద్రుపదుని కొడుకు)(సత్యజిత్తుని ఒకసారి భీష్ముడు ఎనిమిది X రథుడు అంటూనే మళ్లీ అతిరథుడు అంటాడు. కాబట్టి అతిరథుడేనని లెక్కలోకి తీసుకోవచ్చు
అతిరథులు: ద్రుష్టద్యుమ్నుడు, శ్రేణిమతుడు, కృష్ణుడు, కుంతిభోజుడు,
మహారథులు : ఉప పాండవులు, ద్రుపదుడు, విరాట రాజు, ధృష్టకేతు(శిశుపాలుని కొడుకు) , జయంత, అమితౌజులు, సత్యజిత్తు,అజ, భోజులు, వర్ధక్షేమి, ధృడధన్వుడు, రోచమనుడు,

భీష్ముడి వర్గీకరణ లో లోపాలున్నాయా?

భగవాన్ శ్రీ కృష్ణుడు పాండవుల వైపు ఉండటం వల్ల, అలాగే వ్యాసుడు ధర్మం పాండవుల పక్షాన ఉందని నమ్మడం వల్ల పదే పదే మహా భారతం లో కౌరవులు పాండవుల బలం చూసి జడిశారని రాసినట్లనిపిస్తుంది.  బలాబలాల చర్చ చూసినప్పుడు భీష్ముని వర్గీకరణ లో విచక్షణ కొద్దిగా ప్రశ్నార్థకం గా అనిపిస్తుంది.
ఎందుకంటే.. మచ్చుకి..

౧. ఉపపాండవులు మహారథులా? ఏ విధం గా ఆయన ఇలాగ నిర్ణయించారు? వాళ్లు చేసిన ఒక చిన్న యుద్ధమేది? తల్లిదండ్రులు వనవాసానికి వెళ్తే తాతగారింట పెరిగారు. బహుశా మేనమామల దగ్గర నేర్చుకుని ఉండవచ్చు. వారే రథులూ, అతిరథులున్నూ.
౨. ద్రుపదుడు ఒక మహారథి? స్నేహితుడి శిష్యుల చేతిలో ఓడిపోయినవాడు? పైగా వృద్ధుడు ( ఆరోజుల్లో మనుషుల బలం వేరు గా ఉంటే ఉండవచ్చు అనే వాదన ఉండనే ఉంది.. అలాగే ఒకప్పుడు యవ్వనం లో మహారథి అయ్యుండవచ్చు..)
౩. విరాట రాజు మహారథా! బావమరది కీచకుని దురాగతాలు చూసీ చూడనట్లు వదిలేసిన వాడు..
౪. కర్ణుడు అర్థ రథి? భీష్ముడు చేసిన వాదనా పరం గా సహజ కవచ కుండలాలు కోల్పోవడం, శాపాలు.. కారణాలు అయితే, మిగిలిన మహా రథుల పేర్లు చూస్తే, పక్షపాత ధోరణి తప్పక కనిపిస్తుంది.

ఆంధ్రులు?
అయితే మనం కౌరవుల పక్షం లో నిలిచామన్న మాట.


తాత్పర్యం: (గీతా ప్రెస్,గోరఖ్ పూర్ వారి పుస్తకం నుంచి,
మహా భారతం రిఫరెన్స్ : THE MAHABHARATA OF KRISHNA-DWAIPAYANAVYASA
ఆంగ్లానువాదం :ప్రతాప్ చంద్ర రాయ్-
http://www.holybooks.com/mahabharata-all-volumes-in-12-pdf-files/)

27 comments:

  1. పితామహ మహాప్రాజ్ఞ సర్వశాస్త్రవిశారద అని కీర్తించబడ్డ భీష్మాచార్యులవారి కన్నా కృష్ణప్రియ గారు మిక్కిలి మేథావి అని తెలిసి మనందరం తప్పక సంతోషించాలి.

    ReplyDelete
    Replies
    1. ఎందుకో కారణం చెప్పి మరీ ఏడవండి. అసలే నాకు బిపి ఎక్కువ అర్థం కాలేక చచ్చి తగలడుతున్నా.

      Delete
  2. రథసారథి(కృష్ణుడు) ఏ రథుడైతే ఎంత ? కాక పోతే ఎంత ?
    నీదేం పక్షపాతం ?

    భీష్ముడు పాండవులకూ రథుల వర్గీకరణ చేశాడా ?

    వ్యాసభారతం చదివే ఇదంతా వ్రాశారా ?

    ReplyDelete
    Replies
    1. keku,

      సంస్కృత మాతృక లో ఇంతకుముందు చెప్పిన చాప్టర్ల రిఫరెన్స్ అలాగుండగా,
      తిక్కన సోమయాజి రాసిన ఉద్యోగ పర్వం లో పైన నేను రాసిన విషయాలు దాదాపు యదాతథం గా చతుర్థాశ్వాసము లో 232-270 దాకా ఉన్నాయి. వీలుంటే తప్పక చదవండి.

      అక్కడ కర్ణుడిని భీష్ముడు ‘అర్థరథుడనడం.. తర్వాత వారి వాగ్వివాదం అంతా వివరం గా ఉంది.

      Delete
  3. మనది కౌరవ సైన్యమే లెండి. నిజం అన్యాయంగా కనిపించే రోజులొచ్చాయి.

    ReplyDelete
  4. శ్యామలీయం గారు,

    నా మేధావి దనం? :) నా అనుమానాలు మాత్రమే. పురాణ పాత్రలని కించపరచడం అభిమతం కాదు. నాకు అత్యంత ప్రీతికరమైన గ్రంథం, పుస్తకం మహా భారతం.
    నా మొదటి పోస్ట్ లో ఇదే విషయం రాశాను.

    @keku,

    నా రిఫరెన్స్.. ఉద్యోగ పర్వం లో 166, 167,168,169,170,171, 172, 173 అధ్యాయాలు.


    గీతా తాత్పర్యం: (గీతా ప్రెస్,గోరఖ్ పూర్ వారి పుస్తకం నుంచి,


    మహా భారతం రిఫరెన్స్ : THE MAHABHARATA OF KRISHNA-DWAIPAYANAVYASA


    ఆంగ్లానువాదం :ప్రతాప్ చంద్ర రాయ్-


    http://www.holybooks.com/mahabharata-all-volumes-in-12-pdf-files/)

    కష్టే ఫలే మాస్టారు గారు,

    సహదేవుడు దక్షిణ దేశాన్ని రాజసూయ యాగం లో భాగం గా దాదాపు గా కొంత మంది ని ఓడించి, కొంతమంది కి కేవలం రాయబారం పంపి (పాండవుల శౌర్యం చూసి కొందరు, గౌరవం తో కొందరు తల ఒగ్గినట్టు నా రిఫరెన్స్ పుస్తకం లో ఉంది. ఆవిధం గా ఆంధ్ర, ద్రవిడ జాతులని ఓడించినట్లు ఉంది. బహుశా, అందువల్ల తిరిగి కౌరవులతో కలిసి పాండవుల మీద యుద్ధానికి వచ్చారేమోనని నాకనిపించింది.

    ReplyDelete
  5. ఓ, కృష్ణ ప్రియ గారికి ఈ మరో 'కృష్ణ ' ప్రియ కోణమూ ఉందన్నమాట !


    ఉగాది శుభాకాంక్షల తో !

    జిలేబి.

    ReplyDelete
  6. Lol, this is funny, when some one tries analyze some thing, ppl say some particular character in some epic is most intellectual, you don't have that much ability to judge that character, lol, what is the measure here? Ahh! been listening such things from ages.

    Krishnaji, I liked your post.

    ReplyDelete
  7. so many north indian writers nd bengalis write our epics in a absurd way.just by qtng a few lines from them/ref wil not justify ur doubts.one mr saxena[vaaranaasi] wrote in his bhagavatha english version that krishna is just a magician.Based on his book wil u say that krishna is a magician?read the standard nd praamanik texts before u place such a type of posts in ur blog.like the same way some dirty westreners also retrogradedly wrote some nonsense abt our history 7 epics too..

    ReplyDelete
  8. @astrojoyd,

    This reference is pretty much sloka-to-sloka translation of Krishna dwaipayana vyasa's mahabharatam. The translator listed down his own references and wrote note on each sloka where he had confusion and listed the options. (Basically sometimes, there are different ways to understand the same sloka)

    Also, I have not quoted some lines randomly from some random text:) I tried to understand and analyze the 5 chapters of udyoga parva, where Bhishma described the warriers on both sides.

    >>>>>read the standard nd praamanik texts before u place such a type of posts in ur blog.like the same way some dirty westreners also retrogradedly wrote some nonsense

    Please give me the name of standard mahabharatam text, where the translators have not taken the liberty and added their own imaginations.
    I am actually looking for basic text with just pure translation into Telugu/Hindi/English.

    Also, if you could let me know, which part exactly sounded 'retrograded nonsense' in my post,.. I will re-think about it.

    ReplyDelete
  9. ఒక బజ్ పోస్ట్ లో ఒక పెద్దమనిషి శూర్ఫణక రాముడికి శీల పరీక్ష పెట్టిందని వ్రాసారు.
    తన బ్లాగ్ లో పురోహితుడికి అడిగినంత దక్షిణ ఇవ్వక పోతే, ఇవ్వడం ఆలశ్యం చేస్తే రౌరవాది, కుంభీపాక నరకాలకి వెళతారు అని వ్రాసారు. ఆయన ఇక్కడ వ్యాఖ్యానం చేయడం హాస్యాస్పదం. ఆయనకి తెలిసింది ఏమీ లేదని అందరికీ తెలుసు. ఆయన కామెంట్లు పబ్లిష్ చేయడం శుద్ధ దండగ.

    పండితులు సందేహ నివృత్తి చేయాలి. నీకేం తెలియదు అనడం అహంభావం. అది విజ్ఞులు గుర్తుచేసుకుంటే సంతోషిస్తాను.

    కృష్ణప్రియ గారూ మీరు అర్ధం చేసుకున్నది మీరు వ్రాయండి. సహృదయులు అది తప్పైతే చెప్పాలి, విడమర్చి అర్ధం చెప్పాలి.

    ఎగతాళి గానూ, ధూర్తం గానూ వ్రాసే కామెంట్లు పబ్లిష్ చేయకండి.

    ReplyDelete
    Replies
    1. అయ్య బాబోయ్,

      బులుసు గారే నా ఈ కామెంటు కర్త! సెహబాష్ !!

      జిలేబి.

      Delete
    2. మీలా డప్పుకొట్టే వాళ్ళకేమీ కొదువ లేదు. దహ

      Delete
    3. బులుసు గారు,

      థాంక్స్!
      ఈ పోస్ట్ తర్వాత, కేవలం కంటెంట్ మీద వ్యాఖ్యలనే ప్రచురిస్తాను.

      Delete
  10. >> భీష్ముని వర్గీకరణ లో విచక్షణ కొద్దిగా ప్రశ్నార్థకం గా అనిపిస్తుంది

    సైన్యాన్ని వర్గీకరించడానికి అనేక కారణాలూ పద్దతులూ ఉంటాయి. మిలటరీ దృష్టిలో వాటిని విశ్లేషించాలి గానీ, మీరు వేరే కారణాలతో విశ్లేషించడం సరికాదేమో అనిపిస్తుంది.

    అనేక రాజ్యాల సైనికులు కలిసి పాండవుల వైపో కౌరవుల వైపో యుద్దం చేసే టప్పుడు, మేము పలానా వాళ్ళతో కలిసి పని చెయ్యం, మా సైన్యం ఒక ప్రత్యేక కమాండ్ గా మాత్రమే పనిచేస్తుంది లాంటి ఎన్నో కండీషన్స్ తో వస్తారండీ.

    యుద్దం లోకి ఎవరి కారణాలతో వాళ్ళు వస్తారు. వర్గీకరణ చేసేటప్పుడు ఆ యుద్దానికీ దాని చుట్టూ ఉన్న రాజకీయ పరిస్థితుల ఆధారంగా వర్గీకరణ చేస్తారు.

    >> ఉపపాండవులు మహారథులా?

    అందులో అంత ఆశ్చర్యం ఏముంది. రాజ కుటుంబ సభ్యులకి నాయకత్వం దొరకటం మామూలే కదా. వాళ్ళ వ్యక్తిగత క్రెడెన్షియల్స్ కంటే మిగిలిన వాళ్ళనందరినీ నడిపించగలిగే సామర్ధ్యం, వీరి నాయకత్వాన్ని మిగిలిన వాళ్ళు ఒప్పుకుంటారా లేదా లాంటి అంశాలు ఉంటాయి కదా.

    ద్రుపదుడు, విరాట రాజు విషయంలోనూ అంతే. వాళ్ళు ఎంత సైన్యాన్ని తీసుకొచ్చారు అనేది ముఖ్యం కాదా. మరి వాళ్ళు తెచ్చిన సైన్యానికి వాళ్ళు కాక మరెవరో నాయకత్వం వహించడం ఎలా కుదురుతుంది !! వాళ్ళ వ్యక్తిత్వం ప్రకారం వర్గీకరణ చెయ్యాలంటే ఇక వాళ్ళని మన వైపునుండి పోగొట్టుకోవడమే మిగిలేది.

    I am not an expert on Mahabharata. Just giving somethoughts to give a different perspective. btw, Did Bhishma do the formation for both the sides !!! ?

    ReplyDelete
    Replies
    1. Thanks for the comment!

      ఇక్కడ రథుల నిర్వచానాల్లో ఏదైనా పొరపాటుందని అనుకుంటున్నాను. మీరు చెప్పేది సైన్యం వర్గీకరణ, నేను చదివినది వీరుల వర్గీకరణ. నాకు తెలిసి మహారథి అంటే ఇంతమంది తో ఒకేసారి యుద్ధం చేయగల్గిన వాడు అన్నట్టు అర్థం. మీరు చెప్పిన ప్రకారం ఇంతమంది సైన్యానికి నాయకుడు అన్నట్టు.

      మీరు చెప్పిన వర్గీకరణ ప్రకారం.. అయితే I am no questions.

      యుద్ధానికి ముందు భీష్ముడిని దుర్యోధనుడు సభ లో 'పితామహా! మన సైన్యం లో వీరుల గురించి, అలాగే పాండవ వీరుల బలం గురించి చెప్పండి' అని అర్థించగా,.. భీష్ముడు రెండు పక్కల సైన్యం గురించి విశదీకరిస్తాడు

      Delete
    2. వీరుల వర్గీకరణా !! ఇంతమంది తో ఒకేసారి యుద్ధం చేయగల్గిన వాడు అన్నట్టా !!

      ఇదేదో కొంచెం అర్థం కాకుండా ఉంది. పలానావాడు సైన్యంలో ఉంటే ఇంతమంది వీరుల సైన్యం ఉన్నదాంతో సమానం అనే అర్థంలో మెటఫోరికల్గా రాయబడి ఉండొచ్చనిపిస్తుందండీ నాకు. మీరన్న అర్థంలో కాదేమో అనిపిస్తుంది. ఎవరైనా తెలిసిన వాళ్ళు వివరిస్తారేమో చూద్దాం.

      సరే మీరన్న అర్థం లో తీసుకుంటే భీష్ముడు తన అంచనా ప్రకారం అక్కడి వీరుల శక్తి సామర్థ్యాలని చెప్తూ ఉండొచ్చు. అలా అయితే, మీరు లేవెనెత్తిన అభ్యంతరాలకి వాలిడిటీ పెద్దగా లేదనిపిస్తుంది. To me you objections seem to be more emotional based on what we have read and beleived since childhood.

      1. ఉపపాండవులు మహారథులా? ఏ విధం గా ఆయన ఇలాగ నిర్ణయించారు? వాళ్లు చేసిన ఒక చిన్న యుద్ధమేది?

      భీష్ముడి కి తెలిసిన వాళ్ళ వీరత్వమంతా కథలో వ్యాసుడు రాయాల్సిన అవసరం లేదు కదండీ. అన్నీ చూసి తెలిసిన పాత్రగా కథలో భీష్ముడి ద్వారా వ్యాసుడు మనకి నేపధ్యాన్ని వివరిస్తున్నాడు.

      2. ద్రుపదుడు ఒక మహారథి? స్నేహితుడి శిష్యుల చేతిలో ఓడిపోయినవాడు?
      స్నేహితుడి శిష్యుల చేతిలో ఓడిపోయినంత మాత్రాన వీరత్వం కానీ లేకా నైపుణ్యం కానీ తగ్గిపోదు కదా. మహా మహా వీరులైనా కొన్ని యుద్దాల్లో ఓడిపోతారు కదా !

      3. విరాట రాజు మహారథా! బావమరది కీచకుని దురాగతాలు చూసీ చూడనట్లు వదిలేసిన వాడు
      కీచకుడిని ఏమీ చేయకపోవటం వెనక అనేక కారణాలు ఉండొచ్చు. విరాటుడి గుణగణాల ప్రస్తావన ఇక్కడ అవసరం లేదు కదా..

      4. కర్ణుడు అర్థ రథి? భీష్ముడు చేసిన వాదనా పరం గా సహజ కవచ కుండలాలు కోల్పోవడం, శాపాలు.. కారణాలు

      బానే ఉంది కదా. అందులో అభ్యంతర పెట్టాల్సింది ఏముంది ?

      This blog is a nice effort. Go ahead and write your thoughts. I am sure you will get a better understanding yourself and will prompt others towards it. Nobody is perfect.

      Some folks who think they are the owners and are holding the patents and copy rights on all Indian stuff will come hard on you.. respond to them.

      Somefolks who might think everything about old books is evil will also come hard on you. Respond to them as well.

      Delete
    3. మీరు చెప్పింది సబబుగా వుంది

      Delete
  11. @కురు వంశ రాజులు మ్లేచ్ఛ, పుళింద,ద్రవిడ, ఆంద్ర, కంచీ, భోజ, అవంతి, కోసల, రాక్షస, ప్రజ్ఞ్యోతిష, త్రిగర్త రాజులు ఉన్నారు.


    అప్పటికి ఇదే వర్గీకరణ ఉందా లేక ఎవరయినా చొప్పించారా. లేక మహా భారతం వ్రాసేప్పటికి ఈ పేర్లు స్థిరపదిపోయాయా అనిపిస్తున్నది.

    ఏది ఏమయినా మనం కౌరవ సేన అనడం లో అభ్యంతరం ఉన్దకోదదు. పాండవులసేన అంతా బయటి నుండి వచ్చిన వారే దాదాపుగా

    కౌరవసైన్యానికి వ్యతిరేకంగా పోరాడడానికి కావలసిన సమస్యలు మనకేమి ఉన్నట్లు నాకు తెలిసి లెవు. ధృతరాష్ట్రుని పాలన భీష్ముడి సంరక్షణ లో కాస్తంత మెరుగ్గానే ఉంది ఉండాలి . అదేదో అన్నదమ్ముల రాజ్య కాంక్ష గొడవలో జరిగే యుద్దము అని భావించడం తప్పవుతుందా ?

    ముందే వీళ్లడిగిన ఊళ్ళు ఇస్తే ధర్మరాజు వాటిని కూడా ఎప్పుడో జూదంలో పోగొట్టే వాడు . అయినా యద్ధం ప్రజలకోసం, ప్రజల క్షేమం కోసం జరిగినదని భారతం మొత్తంలో ఎక్కడయినా ఉంటె మీ మిగిలిన భాగాల్లో తెలియాలి :) లేకపోతె అప్పట్లో బలమున్నవాడిదే రాజ్యం కాబోలు :(


    (మరేం లేదు మనం కౌరవుల పక్షం కదా, వాళ్ళ పక్షాన మాట్లాడితే ఎలా ఉంటుందా అని :) )

    ReplyDelete
    Replies
    1. అప్పటికి బ్లాగరు పుట్టి వుండరు లేదా బ్లాగరుకు అన్ని జన్మల విషయాలు గుర్తుండవు. చొప్పించడానిమీద మీకంత ఆసక్తి ఎందుకండి?

      Delete
  12. కృష్ణా,
    కదలలేని పరిస్థితిలో దొరికిన సమయాన్ని ఇలా సద్వినియోగం చేసుకున్నావన్నమాట. బావుంది. నువ్వు చదివిన అనువాదం గురించి నాకు ఇప్పటి వరకూ తెలియదు. లింకు పంచుకుని మంచి పని చేశావు. చదవడానికి ప్రయత్నిస్తాను.

    ఇక దేవదత్త పట్నాయిక్ భాష్యానికి మాత్రం నాకు కొంచెం అభ్యంతరాలు ఉండే అవకాశం ఉంది. ఆయన ఆలోచనలని ఇంకొకరు నాకు కొన్నేళ్ళ క్రితం పరిచయం చేశారు. ఆయన వ్రాసినవి కొన్ని చదివి ఆహా అనుకున్నా ఎక్కువ ఏకీభవించలేకపోయాను.

    మరి నిన్నూ అలాగే మూలాన్ని చదివేందుకు (అనువాదమే ఐనా) ప్రేరేపించిందేమో ఆయన రచన నాకు తెలియదు.

    శ్రీపాద వారూ భీముడి అల్లరి గురించి ప్రస్తావించారు ఆయన అనుభవాలూ జ్ఞాపకాలులో. అలాగే ఆంధ్రులు కౌరవుల పక్షాన పోరాడారు అన్న విషయం కూడా లీలగా తెలుసు.ఇప్పుడు నీ ఈ బ్లాగు చదివి ఇంకా తెలుసుకోవాలి అనిపిస్తోంది. ఒక్క సారి చదివి ఒక అభిప్రాయానికి వచ్చే గ్రంథాలు కావు ఇవి. ఐనా అవకాశం ఉన్నప్పుడు ఒక సారైనా పూర్తిగా చదవగలిగే ప్రయత్నం చేస్తే బావుంటుంది కదా. ఆ దిశగా ఆలోచించేలా చేస్తున్నందుకు థ్యాంక్స్.

    ReplyDelete
    Replies

    1. భీముడి అల్లరి కొద్దిగా మోటు గా ఉంటుంది.. అవును. :)

      ఇక మహా భారతాల విషయానికొస్తే కవిత్రయం రాసిన గ్రంథం ఒక్కటే చాప్టర్ చదివాను.
      చిన్న చిన్న పుస్తకాలతో పాటు, రాజగోపాలాచారి గారి పుస్తకం, భారతం లో చిన్న కథలు , భైరప్ప గారి పర్వ,దేవదత్త పట్నాయక్ 'జయ', ఇరావతి గారి యుగాంత ..లాంటివి చదివినా,వ్యాస భారతానికి దగ్గరైన పూర్తి స్థాయి మహాభారతం వర్షన్ మాత్రం ఇదే చదవటం. మిత్రులు TTD వారి పుస్తకాల సెట్ చదవమని సూచించారు కానీ..నేనింకా కొనలేదు. చూడాలి.

      Delete
  13. భీష్ముడి కారెక్టర్ మీద మీ అసంబద్ధంగా, అల్పబుద్ధితో చేసినట్లుగా వున్నాయి. నలుగురు మెచ్చుకుంటే పురాణాల్లో కూడా ప్రవేశించి మీ టాలెంట్ చూపిద్దామనుకోవడం దురదృష్టకరం. అందరికి అన్ని టాలెంట్లు వుండవు, వుండాల్సిన అవ్సరం లేదు. మీ వుత్సాహం అదుపులో పెట్టుకుంటే బాగుంటుంది. మహా భారతం అంతా చదివించుకుని, అందులో తనకు నచ్చిన వాళ్ళు ఏక్ బుడ్డా (భీష్ముడు), ఏక్ లడకా (అభిమన్యు) అన్నాడట, అక్బర్.

    ReplyDelete

  14. పురిపండా అప్పలస్వామి గారి మహాభారతం పుస్తకాలు కూడా చదవచ్చు.

    ReplyDelete
  15. చాలా చక్కగా చెప్పారు. ఇంత చిన్న వయస్సులో ఇంత గొప్పగా వ్యక్తీకరించటం విశేషం. శుభం భూయాత్.

    -గౌరీరవిశంకర శర్మ
    (www.kgravishankar.wordpress.com)

    ReplyDelete